గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. పలువురు ఇరువురి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలర్పించిన వీర వనితలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. నరసింహారావు, మహిళా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.