విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు

85చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు
మహాశక్తి ప్రతిరూపమైన దుర్గాదేవిని పూజించి ఆరాధించే విజయదశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్