ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్‌కు సోమవారం కనకదుర్గ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. 6వ ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల కృష్ణ తన బైకులో ప్రయాణిస్తుండగా వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు అతను హెల్మెట్ ధరించడంతో ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి, అతనిని ప్రథమ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.