అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం వద్ద అఘోరీ హల్చల్
అమరావతిలోని అమరేశ్వర స్వామి దేవస్థానం వద్ద అఘోరి హల్చల్ చేసింది. కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానం వద్దకు వచ్చారు. అఘోరిని చూడటానికి జనం గుంపులు గుంపులుగా ఎగబడటంతో కొంతసేపు అఘోరి కారులోనే ఉండిపోయింది. పోలీసులు అఘోరికి దర్శనం చేయించిన అనంతరం తిరిగి పంపించి వేశారు.