కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్ నెంబర్ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్‌ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్ నెంబర్ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది.