అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1 నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని కీలక అప్ డేట్ ఇచ్చారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని.. వచ్చే నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అలాగే రాజధానితో పాటు 26 జిల్లాల అభివృద్ధి కూడా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.