అవనిగడ్డ: జల వనరుల శాఖలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలి

83చూసినవారు
అవనిగడ్డ: జల వనరుల శాఖలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలి
జల వనరుల శాఖలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శనివారం అవనిగడ్డ సబ్ డివిజన్ జల వనరుల శాఖ నూతన డీఈఈగా బాధ్యతలు చేపట్టిన పులిగడ్డ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. నియోజకవర్గంలో ఏడు ప్రధాన ఔట్ ఫాల్ స్లూయీజ్ ల పునర్నిర్మాణానికి రూ. 38 కోట్ల 75 లక్షల అంచనాతో పంపిన ప్రతిపాదనల అనుమతులకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్