అవనిగడ్డ: పనులను వేగవంతంగా చేపట్టాలి: ఎమ్మెల్యే

79చూసినవారు
అవనిగడ్డ: పనులను వేగవంతంగా చేపట్టాలి: ఎమ్మెల్యే
డ్రైనేజీ శాఖలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో డ్రైనేజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లపల్లి సబ్ డివిజన్ పరిధితో పాటు, అయినంపూడి డ్రైనేజీ పరిధిలో చేపట్టిన పనులు, నూతన ప్రతిపాదనలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఈ, ఏఈలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్