ఘంటసాల గ్రామస్తుడైన కొడాలి భక్తపాల్ కు నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం డిల్లిలో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవ సేవ సామాజికవాదిగా పురస్కారం అందించారు. భక్తపాల్ చేసిన పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. అతి చిన్న గ్రామం నుండి ఢిల్లీ స్థాయికి పేరు ప్రఖ్యాతలు గాంచిన భక్తపాల్ సేవలు అమోఘమని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆ సంస్ధ చైర్మన్ మార్టిన్ కాట్రగడ్డ, డేవిడ్ మనోహర్ పాల్గొన్నారు.