చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డలో ఉన్న ఐవీఎం స్వచ్ఛంద సంస్థ పేదవర్గాలకు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మోపిదేవి మండల పరిధిలోని కే. కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లోని వరద బాధితులకు ఐదు లక్షల విలువచేసే నిత్యవసరాలు, దుప్పట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఐవీఎం సభ్యులు పాల్గొన్నారు.