కోడూరు: పాలకాయతిప్ప బీచ్ వద్ద పోటెత్తిన భక్తజనం

53చూసినవారు
కోడూరు: పాలకాయతిప్ప బీచ్ వద్ద పోటెత్తిన భక్తజనం
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద భక్త జన సందోహం పోటెత్తింది. కార్తీక పౌర్ణమి శుక్రవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సముద్రస్నానాలు ఆచరించారు. సముద్ర తీరంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిచే బందోబస్తు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్