కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ పండితులు, అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.