మోపిదేవి మండలం కే. కొత్తపాలెం వద్ద కృష్ణా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్ల పేరుతో అక్రమంగా శుక్రవారం సాయంత్రం ఇసుక తరలిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. తహసీల్దార్ శ్రీ విద్య మోపిదేవి మండలం సీఆర్జెడ్ పరిధిలో ఉందని, అసలు ఇసుక తవ్వకాలు చేపట్టడానికి వీలు లేదని హెచ్చరించారు. అయిన కొంతమంది కావాలనే కృష్ణానదిలోకి వెళ్ళి పడవల సాయంతో ఇసుక తరలిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.