పని ఒత్తిడిని తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని పిఠాపురంకు చెందిన కోట సత్యలావణ్య (32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. బాచుపల్లిలోని ఎంఎన్ రెసిడెన్సీలో ఉంటున్నారు. లావణ్య బాచుపల్లిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తుంటారు. కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె బంధుమిత్రుల వద్ద వాయిపోయిందని సమాచారం. ఈ క్రమంలో భవనం పైనుంచి దూకడంతో ఆమె మృతి చెందారు.