ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వంశి, రామగుండం ఎమ్మెల్యే మాక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లు విచ్చేశారు. ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వైకుంఠ ద్వారాలు తెరిచి స్వామి వారిని దర్శించుకున్నారు.