తమ వదిన వల్ల తాము నరకం అనుభవిస్తున్నామని ఓయువతి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. IIM గ్రాడ్యుయేట్ ప్రత్యూష అనే యువతి మాట్లాడుతూ.. 'HYDలో అ.ప్రొఫెసర్ అయిన నా సోదరుడికి రాజమండ్రి మహిళతో 2019లో పెళ్లి జరిగింది. 10 రోజులే ఇంట్లో ఉన్న ఆమె కుటుంబంపై వరకట్నం, గృహహింస కేసులు పెట్టింది. అప్పటి నుంచి కేసు విచారణ జరగలేదు. 498A సెక్షన్ నిందితురాలిగా ఉండటంతో నాకు జీవితంలో చాలా నష్టం జరుగుతోంది' అని వాపోయారు.