ఆటో నుంచి జారిపడి విద్యార్థిని మృతి (వీడియో)

54చూసినవారు
AP: విశాఖలోని ఎస్.రాయవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. లింగరాజుపురం గురుకుల పాఠశాల విద్యార్థిని యోగిత సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్తూ.. ఆటోలో నుంచి జారిపడి మృతి చెందారు. ఆటోలో వెళ్తుండగా.. సోముదేవుపల్లి వద్ద గతుకుల వల్ల యోగిత అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందారు. యోగిత స్వస్థలం రోలుగుంట మండలం కొండపాలెం గ్రామం.

సంబంధిత పోస్ట్