వాగులో కొట్టుకుపోయిన యువకుడు
కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో కురిసిన వర్షానికి వాగు ఉప్పొంగి రోడ్డుపై ప్రవహిస్తుంది. రోడ్డుపై వాగు నీరు ఉధృతిగా ప్రవహిస్తుండగా యువకుడు ఆగకుండా బైక్ వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో యువకుడు వాగు కొట్టుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.