గ్రామ వాలంటీర్ల పోస్టులకు ముగిసిన ఇంటర్వ్యూ లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల నియామకం ప్రక్రియలో భాగంగా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ పి.అనురాధ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు జులై 11 నుంచి నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లు జులై 23 వ తేదీ మంగళవారంతో ముగిశాయి. మండలంలోని 21 గ్రామ పంచాయితీల పరిధిలోని గ్రామాలకు సంబంధించి 298 గ్రామ వాలంటీర్ల పోస్టులకు మొత్తం 871 మంది ఇంటర్వ్యూ లకు అర్హత సాధించారని వీరిలో 670 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ లకు హాజరయ్యారని ఎంపిడిఒ తెలిపారు.670 మందిలో 368 మంది మహిళా అభ్యర్థులు కాగా పురుష అభ్యర్థులు 302 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు ఆమె వెల్లడించారు.