ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు. మంగళవారం గన్నవరం లో రూ. 8. 75 లక్షల మేర నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.