గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గుడివాడ రూరల్ మండలం కొత్త చౌటపల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించారు. కొత్త చౌటపల్లి గ్రామంలోని మల్లయపాలెం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కుటమీ నేతలు ఘన స్వాగతం పలికారు.