వరద మంపు గురై నష్టపోయిన ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) అన్నారు. పెనుగంచి ప్రోలు గ్రామాల్లో సోమవారం పర్యటించి వరద ముప్పు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ఆస్తి నష్టంపై నివేదిక తయారు చేయవలసిందిగా ఆదేశించారన్నారు. ముండ్లపాడు, పెనుగంచిప్రోలు, సుబ్బాయిగూడెం, ముచ్చింతాల రహదారులను తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.