బాల్య వివాహాలు చేయడం చట్టరీత్య నేరం అని, అలా కాకుండా వివాహాలు చేస్తే శిక్షలు తప్పవని ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగలక్ష్మి, ప్రసన్నలు అన్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గురువారం మండల కేంద్రమైన మండవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, గన్నవరం సెక్టార్ పరిధిలోని పుట్ల చెరువు హైస్కూల్ లలో పౌస్టికాహార వారోత్సవాలతో పాటు ర్యాలీ నిర్వహించారు. కిషోర బాలికలకు పోషకాహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారన్నారు.