కైకలూరు : మురుగు కాలువలను ప్రక్షాళన చేయాలి: కామినేని

69చూసినవారు
కైకలూరు : మురుగు కాలువలను ప్రక్షాళన చేయాలి: కామినేని
డ్రెయినేజీ మురుగు కాలువలను ప్రక్షాళన చేసి గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపులో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం అసెంబ్లీలో ప్రస్థావించారు . గత వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో మురుగు కాలువలను ఆధునికీకరించిన పాపాన పోలేదని తెలిపారు. గుర్రపు డెక్క, తూడు, కిక్కిస తొలగింపులో గుత్తేదారులు తక్కువ ధరకు టెండరు వేసి నామమాత్రపు పనులు నిర్వహిస్తుండటంతో సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్