జూద శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలిదిండి ఎస్సై వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా శుక్రవారం మండలంలోని మట్టగుంటలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోడి పందేలు వేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 3,500, ఒక కోడి పుంజు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.