ముంపు బారిన పడి జలదిగ్బంధంలో చిక్కుకున్న మద్వానీగూడెం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నిత్యవసర సరుకులు అందచేసి ఆదుకోవాలని మాజి ఎమ్మెల్యే డిఎన్నార్ అన్నారు. ఆదివారం కలిదిండి మండలంలోని ముంపునకు గురైన ప్రాంతాలలో నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని అధికారులను కోరారు.