చైనా, మణిపుర్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 'భారత భూభాగాన్ని చైనా వేల కి.మీ వరకూ ఆక్రమించింది. దీనిపై చర్చించేందుకు పాలకులకు ధైర్యం లేదు. మణిపుర్లో శాంతి కోసం భారత బలగాలు ఆ ఆయుధాలను సీజ్ చేయలేవా? చైనా దురాక్రమణ, మణిపుర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి' అని అన్నారు.