రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పంచాయతీ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిణిగా కృష్ణాజిల్లాకు జే. అరుణను నియమిస్తూ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వరకు ఇక్కడ పనిచేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు.