జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

57చూసినవారు
జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణం పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అవనిగడ్డ, గుడివాడ, పెడన నియోజకవర్గాలలో గృహ నిర్మాణం వెనుకబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్