కృష్ణా జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందే విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం ఆయన సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు.