రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం వేకువ జామున నగరంలో పలు ప్రాంతాలు సందర్శించారు. స్థానిక ప్రజలను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాన్యుడిలా హోటల్ వద్ద టీ తాగుతూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.