తెలుగు జాతి మరువలేని గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి మాట్లాడారు. పేద ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చారని తెలిపారు. ఆయనలాంటి మహనీయుడు మరెవ్వరు ఉండరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు పాల్గొన్నారు.