కంచికచర్ల: పెరిగిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలి
కంచికచర్ల మండలం కంచికచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మందా వజ్రయ్య నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆప్ ఛార్జీల పేరిట ఒకేసారి రూ. 6, 072 కోట్ల భారాన్ని సామాన్య ప్రజలపై మోపడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.