నందిగామలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నందిగామ పట్టణం కాకానీ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆపరేషన్ మరియు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం మంజూరు చేసిన రూ: 58, 29, 169/-ల చెక్కులను 46 మందికి పంపిణీ చేశారు. ఈసందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సహాయార్థం సీఎం డిప్యూటీ సీఎం సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయటం ఆనందదాయకమన్నారు.