నందిగామ నియోజకవర్గంలో ఖరీఫ్ చివరి దశలోనూ అన్నదాతలు సాంకేతికతపై ఆధారపడుతున్నారు. గతంలో నవంబర్ నెలలో ఎక్కడ చూసినా కూలీలు బిజీ బిజీగా కనిపించేవారు. ఓవైపు కోతలు, మరోవైపు మోతలు మరోవైపు నూర్పిళ్ళు ఇలా సందడి వాతావరణం కనిపించేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిమిషాల వ్యవధిలో కోత, నూర్పిడి పూర్తి చేసి ధాన్యం రాశిని ముందుంచే యంత్రాలు అందుబాటులోకి వచ్చేసాయి.