సారా బట్టీలపై దాడి-వ్యక్తిపై కేసు నమోదు

59చూసినవారు
సారా బట్టీ పై దాడిచేసి వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ముసునూరు ఎస్ఐఐ పి. వాసు తెలిపారు. మంగళవారం ముసునూరు మండలం చెక్కపల్లిలోని అడవిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా బట్టీపై ముసునూరు ఎస్ఐ, సిబ్బంది దాడులు నిర్వహించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని మూడు లీటర్ల నాటుసారా, 600 లీటర్ల బెల్లపు ఊట, గ్యాస్ పొయ్యి, గ్యాస్ బండ, డ్రమ్ములను స్వాధీనం చేసుకుని, వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్