పామర్రు నియోజకవర్గంలో కోడిపందాలు, జూదాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనితో లక్షల రూపాయల్లో చేతులు మారుతున్నాయి. రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖ అధికారులు కోడిపందాలు ఆడిన చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చేసిన ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితమైందంటూ విమర్శలు విలువెత్తుతున్నాయి. సోమవారం తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో కోడి పందాలదారులకు బాటలు వేశారు. యాకమూరులో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.