రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీపై పునరాలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పాముర్రు నియోజకవర్గ ఇంఛార్జీ డివై దాసు ప్రభుత్వానికి సూచన చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఉచిత పాలసీ అమలు చేయడం సబబేనని అలాగే ఇసుక అమ్మకాలు కొనుగోళ్లకు జీఎస్టీ రద్దు చేయడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.