కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని తమిరిశ-పోలుకొండ ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో అటుగా ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. అనేకమార్లు సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.