పామర్రు: రూ.300 కోసం గొడవ.. వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని చాట్లవానిపురంలో ఈనెల 20వ తేదీన జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలు పాలైన చాట్ల సతీశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు సీఐ శుభాకర్ తెలిపారు. చాట్ల సతీశ్, చాట్ల వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్య రూ.300 విషయంలో గొడవ జరగగా వెంకటేశ్వరరావు కర్రతో సతీశ్ పై దాడి చేశాడని తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.