మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, ప్రస్తుత ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇరువురు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని పెడన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శొంఠి నాగరాజు ఆరోపించారు. రైతు సమస్యలపై శుక్రవారం కృత్తివెన్ను మండలంలో పర్యటించిన ఆయన కబ్జాకు గురైన మడ భూములను రైతులకు అప్పగించాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ భూమిని రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.