పెడన నియోజకవర్గంలో గురువారం సాయంత్రం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కల్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని తెలిపారు. రవాణా, గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్టు వివరణ ఇచ్చారు. తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని సూచించారు.