కోడిపందేలు అనగానే ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సంవత్సరం ఆ జిల్లాలకు ధీటుగా కృష్ణా జిల్లాలోని వేమవరం, పెడన, బంటుమిల్లి మండలాలో సోమవారం కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ద్విచక్ర వాహనాలను బహుమతులుగా ప్రకటించి పందేలు నిర్వహించారు. వేమవరం బరిలో రూ. 10లక్షల పందేంలో 4 పందేలు నెగ్గి బుల్లెట్ కైవసం చేసుకోవటంతో అందరి దృష్టి వేమవరం బరివైపు మళ్ళింది.