విఘ్నాలకు అధిపతివిగ్నేశ్వర స్వామి వారి కృపతో ప్రజలకు వరద కష్టాలు తొలగిపోవాలని పెడన నియోజవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు. నాగేశ్వరావుపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న వినాయక చవితి పర్వదిన వేడుకల్లో పాల్గొని పూజలు చేసారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ, వరద కష్టాల నుండి ప్రజలందరూ బయటపడాలని విగ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగిందన్నారు.