ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. సోమవారం తాడిగడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు రూ. 5 - 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.