కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం రాత్రి తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని దీని వల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.