పోరంకిలో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. పెనమలూరుకు చెందిన ఓ వృద్ధురాలని పీక నొక్కి ఆమె మెడలో ఉన్న బంగారం చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని స్తంభాన్ని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.