ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఏ కొండూరు మండలం తండాలో అంగన్వాడీ కేంద్రం లో 18 మంది చిన్నారులు ఉండగా, 9 మంది చిన్నారులకు అస్వస్థకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో వాంతులు, విరోచనాలతో చిన్నారులు డీలా పడ్డారు. హుటాహుటిన తమ పిల్లలను తల్లిదండ్రులు మైలవరం ఆసుపత్రి తరలించారు.