సీపీఎం తిరువూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా శుక్రవారం తిరువూరు పట్టణంలో గల ముఠా వర్కర్స్ , బిల్డింగ్ వర్కర్స్ ఆటో వర్కర్స్ లను కలసి వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య లను తెలుసుకున్నారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు.