భారీ వర్షాలకు తిరువూరు నియోజకవర్గ మండలాల్లో గ్రామాలు జలప్రళయంగా మారాయి. ఎక్కడ చూసినా రోడ్లు మీద వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం తిరువూరు మండలం మల్లెలలోని పిల్ల వాగు ఉధృతిని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ వాగు పరిస్థితిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ వాగు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లుగా పోలీసులు తెలిపారు.